ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ధ్యేయం: జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

గచ్చిబౌలి, సెప్టెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటామ‌ని, బస్తీలు, కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామ‌ని నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. సోమ‌వారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ అసోసియేషన్ సభ్యులతో కాలనీలో నెలకొన్న మౌళిక వసతుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ళ‌ శ్రీధర్ బాబుల‌ దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

డు మనం చేసే పనులు రాబోయే తరాలకు మేలు జరిగేలా ఉండలని, త‌న దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు మంచి జరిగేలా చూస్తానని తెలిపారు. గెలుపోటములకు అతీతంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం ఉంటుందని మరో సారి స్పష్టం చేశారు. కాగా జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ ప‌లు సమస్యలను వెంటనే పరిష్క‌రించారు. మిగతా వాటి ప‌రిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు సయ్యద్ గౌస్, భారత్, కార్తిక్, రవి, శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here