మాదాపూర్, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మాదాల 3 నెలల్లోనే 100 కు పైగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసి, జుట్టు పునరుద్ధరణలో గణనీయమైన విజయాన్ని సాధించారని మెడికవర్ హాస్పిటల్స్ ఒక ప్రకటనలో తెలియజేసింది. డాక్టర్ రాజశేఖర్ మాదాల ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ (FUE) వంటి ఆధునిక హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ విధానాలు అత్యంత సురక్షితమైనవని చెప్పారు. సాంకేతికత అభివృద్దితో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్లు సూటిగా, తక్కువ-రిస్క్, డే కేర్ విధానంగా మారాయన్నారు, సహజంగా కనిపించే ఫలితాలను అందిస్తున్నాయన్నారు. రోగులు సాధారణంగా కనీస అసౌకర్యాన్ని గురికాకుండా, ఒక రోజులో వారి సాధారణ కార్యకలాపాలకు తిరిగి వెళ్లవచ్చన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేసే సాధారణ సమస్య జుట్టు రాలడం అన్నారు. 85% కంటే ఎక్కువ మంది పురుషులు, 40% మంది స్త్రీలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో జుట్టు పలుచబడటం లేదా బట్టతలని అనుభవిస్తున్నారని అన్నారు. వంశపారంపర్యంగా లేక ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, సరైన ఆహారం, పర్యావరణ కాలుష్యం వంటి అంశాలు కూడా సమస్యకు దోహదం చేస్తున్నాయని అన్నారు. వెంట్రుకలు తగ్గడం లేదా బట్టతల, పాచెస్ ఉన్న వ్యక్తులు ప్రత్యేకించి మందులు లేదా PRP లేదా GFC చికిత్స వంటి శస్త్రచికిత్సలు విజయవంతం కానట్లయితే మార్పిడిని పరిగణించాలన్నారు. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత స్థిరంగా జుట్టు రాలుతున్న వారికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్లు చాలా ప్రభావవంతంగా ఉంటాయన్నారు.
జుట్టు మార్పిడి కేవలం పురుషులకు మాత్రమే కాదు చాలా మంది మహిళలు కూడా ఈ ప్రక్రియ నుండి ప్రయోజనం పొందుతారన్నారు. ముఖ్యంగా బట్టతల లేదా హార్మోన్ల అసమతుల్యత కారణంగా జుట్టు సన్నబడటం వంటి సమస్యలు గాయం లేదా మునుపటి శస్త్రచికిత్స నుండి జుట్టు కోల్పోయిన రోగులు కూడా ఈ ప్రక్రియ ద్వారా ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఈ చికిత్స కేవలం 4 నుండి 5 గంటల వ్యవధిలోనే పూర్తవుతుందని తెలిపారు. వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చన్నారు.