బీసీలంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి: క‌స్తూరి గోపాల‌కృష్ణ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీసీలందరూ ఏకతాటి పైకి వచ్చి రాజ్యాధికారం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలని కస్తూరి గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. బీసీ సంఘాలు, సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలు, అభిమానుల సమావేశాన్ని బీసీ భవన్ లో నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో కస్తూరి గోపాలకృష్ణతోపాటు జై బీసీ ఆర్గనైజర్ సెక్రెటరీ జనరల్ ఆర్కే సాయన్న ముదిరాజ్, అడ్వకేట్ శేషగిరిరావు, లాలూ నాయక్, నర్సింహులు, మురళీధర్ దేశ్ పాండే, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామ్ చందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రామ్ చంద‌ర్ యాద‌వ్ మాట్లాడుతూ.. బీసీలంద‌రూ ఒకేతాటిపైకి రావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు. మ‌న హ‌క్కుల కోసం పోరాటం చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో శేరిలింగంపల్లి ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ యాదవ్, జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్ పాల్గొన్నారు.

స‌మావేశంలో పాల్గొన్న బీసీ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here