గచ్చిబౌలి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని లక్ష్మీ విహార్ ఫేజ్ 1 లో నెలకొల్పిన గణేష్ మండపం వద్ద ఏర్పాటుచేసిన లడ్డూ వేలం పాటలో స్థానికంగా ఉన్న ఎం.శ్రీశైలం పాల్గొని గణేష్ లడ్డూను రూ.3.64 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డూ పాటలో తమకు లడ్డూ దక్కడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు సువర్ణ, సందీప్, నిహారిక, సాయి ప్రియ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.