- పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు సుందరీకరణ పనులలో భాగంగా చేపడుతున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డీసీ రజినీకాంత్ రెడ్డి, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ కొబ్బరి కాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా పటేల్ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు తుది దశలో ఉన్నవని, పటేల్ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. చెరువు చుట్టుపక్కల ప్రజల విజ్ఞప్తి మేరకు గుర్రపు డెక్క ద్వారా తొలగింపు కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. గుర్రపు డెక్క తొలగింపు పనులలో వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డీఈ నళిని, ఏఈ పావని, జీహెచ్ఎంసీ ఎస్ ఈ శంకర్ నాయక్, ఈఈ కేవీఎస్ రాజు, డీఈ శిరీష, ఢీఈ దుర్గ ప్రసాద్, డీఈ స్రవంతి, ఏఈ సంతోష్ రెడ్డి , ఏఎంహెచ్ఓ రవి కుమార్, ప్రాజెక్టు ఆఫీసర్ ఉషారాణి , స్ట్రీట్ లైట్స్ ఈఈ మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.