ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కలిసిన టీపీసీసీ కార్యదర్శి సామ్యూల్ కార్తీక్

నమస్తే శేరిలింగంపల్లి : కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లింగంపల్లి బ్రిడ్జి వద్ద నీటి నిలువలు దాదాపు తగ్గిపోయి ప్రయాణికులకు కొంత ఊరట ఇచ్చిన నేపథ్యంలో టిపిసిసి కార్యదర్శి సామ్యూల్ కార్తీక్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సమస్య పూర్తి పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, పాపి రెడ్డి కాలనీ వాసుల కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి జోనల్ కమీషనర్లు కార్యాలయానికి కలిసి లింక్ రోడ్డు పనులను త్వరగా ప్రారంభించాలని కోరారు. అందుకు సానుకూలత వ్యక్త పరిచారు. తక్కువ సమయంలోనే రోడ్డు నిర్మాణం చేపడుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు రవీందర్, ఆనంద్ పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here