- పాల్గొన్న బి.సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: మండల్ కమీషన్ చైర్మన్ బి.పి.మండల్ వారోత్సవాల వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 14వ రోజు షాద్ నగర్ లో తాలూకా బి.సి.సంక్షేమ సంఘం నాయకులు నడి కూడ యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి.సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ పాల్గొని మాట్లాడారు. బీసీ లకు లోకల్ బాడి ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. రాబోయే లోకల్ బాడి ఎన్నికలలో బి.సిలు కార్పొరేటర్, మేయర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసి లుగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు.
నడికూడ యాదగిరి యాదవ్ మాట్లాడుతూ బీసీ జాతి కోసం నిరంతరం కృషిచేసిన బీపీ మండల్ కు ఘనమైన నివాళులు అందించాలంటే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై బీపీ మండల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.సి. సంక్షేమ సంఘం నాయకులు అనమోని నరసింహులు యాదవ్, వెంకటేష్ యాదవ్, రాజు యాదవ్, శేఖర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సంతోష్ యాదవ్ బీసీ సంఘాల నాయకులు, అభిమానులు కార్యకర్తలు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.