నమస్తే శేరిలింగంపల్లి : లింగంపల్లి డివిజన్, మసీదు బండ చౌరస్తాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొని జెండాను ఎగురవేశారు.
అమరవీరుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్య్రాన్ని మన హక్కుగా భావించి ప్రతి ఒక్కరూ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.