శేరిలింగంపల్లి డివిజన్ లో ఘనంగా స్వాతంత్య దినోత్సవం

  • జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని పరిసర ప్రాంతాల్లో 78వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి జోనల్ కార్యాలయ ఆవరణలో ఉదయం 07:30 గంటలకు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి తదితర డివిజన్ల కార్పొరేటర్లతో, జీహెచ్ఎంసీ అధికారులతో, పురప్రముఖులతో, సీనియర్ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం కార్పొరేటర్ వార్డు కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను కార్పొరేటర్ ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.  అనంతరం సుదర్శన్ నగర్ కాలనీ, నెహ్రూనగర్ కాలనీ, గోపినగర్ కాలనీ, ఆదర్శనగర్, ఆదర్శ్ నగర్ కమిటీ హాల్, జెడ్పీహెచ్ఎస్ శేరిలింగంపల్లి, హుడా ట్రేడ్ సెంటర్, మైత్రి హై స్కూల్, ఆక్స్ఫర్డ్ స్కూల్ తారానగర్, జై హనుమాన్ ఆటో స్టాండ్ రైల్వే అండర్ బ్రిడ్జి, అంబేద్కర్ చౌక్ ఆర్జికే, ఎంపీపీఎస్ సురభి కాలనీ, ప్రశాంతి నగర్, బాపునగర్, హనుమాన్ యూత్ బాపునగర్, ఇందిరానగర్, గచ్చిబౌలి స్ట్రీట్ నం.1, స్ట్రీట్ నం 2, చిన్న అంజయ్య నగర్, ఆయా కాలనీలలో స్థానిక నాయకులతో, ప్రజా ప్రతినిధులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. వివిధ కాలనీలలో రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ తిరంగ పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం చేశారు.
లింగంపల్లి విలేజ్ రావ్స్ జిమ్ వద్ద ఎస్ఎల్వీడీసీ ప్రెసిడెంట్ రవి యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి జాతీయ పతకాన్ని ఎగురవే మిఠాయిలు పంచుకుంటూ సంబురాలు జరుపుకున్నారు.

జెండా ఎగురవేసి.. జెండాకు వందనం చేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..మన ప్రియమైన మాతృభూమిని విముక్తి చేయడానికి అవిశ్రాంతంగా పోరాడిన అసంఖ్యాక ధైర్యవంతుల కోసం.. మన హృదయాలు గర్వంతో, కృతజ్ఞతతో ఉప్పొంగుతున్నాయని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం భారతీయ ప్రజల ధైర్య సాహసాలు జట్టుకృషి, దృఢమైన స్ఫూర్తిని సూచిస్తుందన్నారు. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బాలా గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, లాలా లజపతిరాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు, మొదలైన నాయకుల సంకల్పంతో స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపి మనకు అద్భుతమైన బహుమతిని అందించిన మహానుభావులను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ పురప్రముఖులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, యువ నాయకులు, బస్తీ కమిటీ మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్లు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, మహిళా నాయకురాలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here