నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్ జన్మదినం సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డివిజన్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో డివిజన్ లోని పలు ప్రాంతాల్లో పేదలకు, శివానంద లేప్రసీ హాస్పిటల్ లో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు విద్య కల్పన ఏకాంత్ గౌడ్ పండ్లు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పల్నాటి అశోక్, గణేష్ గౌడ్, అల్వలా రమేష్, వెంకటేశ్వర్లు, మునిశ్వర్ రావు హరినాథ్ గౌడ్, పోతురాజు గౌడ్, అల్వలా భాస్కర్, వినోద్, నాగరాజు, నవీన్, మర్ల శ్రీను, బొట్టు శ్రీను, సంధ్య, ఉపేంద్ర, కళ్యాణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .