- బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ ఎంఏ నగర్ బస్తీ వాసులకు భారతీయ జనతా పార్టీ తరఫున తాము అండగా ఉంటామని బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ తెలిపారు. కన్వీనర్ రాఘవేంద్రరావు , సీనియర్ నాయకులు నాగుల్ గౌడ్ ఆద్వర్యంలో ఎంఏ నగర్ బస్తీ వాసులను కలిసి తామున్నామంటూ ఆ కాలనీవాసులకు భరోసా కల్పించారు. ప్రభుత్వ భూముల్లో గత 30 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరుచుకొని ఉంటున్న పేదల ఇళ్ళకు పట్టాలు ఇవ్వాలని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని, హెచ్ఎండీఏ అధికారులు ఇస్తున్న నోటీసులను ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు.
హెచ్ఎండీఏ అధికారులు నోటీసులు అందించి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తరఫున న్యాయ పోరాటం చేసి హెచ్ఎండీఏ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అవసరమైతే హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు మాన్యం, రవికాంత్, లారీ శీను, గౌతమ్, ప్రవీణ్, ప్రకాష్, వినోద్, అయ్యన్న, నాయకులు లక్ష్మణ్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, గణేష్ ముదిరాజ్, శివారెడ్డి, రాము, పవన్ యాదవ్, పాపయ్య పాల్గొన్నారు.