- ప్రజలందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ ఈద్గా నందు నిర్వహించిన ప్రార్ధనలో పాల్గొని ప్రజలకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో పేద ముస్లింలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, అన్ని కులాలు, మతాలను సమానభావంతో చూస్తున్న సెక్యులర్ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ఏకే బాలరాజు, కృష్ణ ముదిరాజ్, వీరందేర్ గౌడ్, మహిపాల్ యాదవ్, మన్నెపల్లి సాంబశివరావు, కట్ల శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్, పోచయ్య, నితిన్, లక్ష్మణ్, మునఫ్ ఖాన్, హమీద్, రహీం, హనీఫ్, ఖాజా, ముషారఫ్ పాల్గొన్నారు.