- ప్రజాసంఘాల డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ నడిగడ్డ తండాలో 7న అదృశ్యమైన చిన్నారి బానోతు వసంతపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నడిగడ్డ తాండ నుండి మియాపూర్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వరకు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బానోతు వసంతకు సంఘీభావంగా ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ దేవనూర్ లక్ష్మి అధ్యక్షుత జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎఫ్ డిడబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి అంగడి పుష్ప మాట్లాడుతూ పొట్టకూటి కోసం నడిగడ్డ తాండకు వలస వచ్చిన…… దంపతుల కూతురు చిన్నారి బానోతు వసంతకు ఇలా జరగడం బాధాకరమన్నారు. తమ కూతురు కనబడటం లేదని ఆ చిన్నారి తల్లిదండ్రులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆచూకీ తెలుపకపోవడంతో వారం రోజుల తర్వాత చిన్నారి మృతదేహం పొదలలో లభ్యమైందన్నారు. చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసి పొదలలో పడేసినట్లుగా నిర్ధారణ అవుతున్నట్లు తెలిపారు.
చిన్నారి వసంత మృతదేహం లభ్యమై 24 గంటలవుతున్న పోలీసులు ఇప్పటివరకు జరిగిన పరిణామాన్ని పసిగట్టకపోవడం విడ్డూరమన ఆరోపించారు. చిన్నారి వసంతపై అఘాత్యానికి పాల్పడిన వారిపై పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఐఎఫ్ డివై గ్రేటర్ హైదరాబాద్ నాయకుడు ఇస్లావత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ.. ఎలాంటి మిస్సింగ్ కేసులైన నేరపూరితమైన కేసులైన 24 గంటలలో సేదించే పోలీసులు చిన్నారి వసంత కనపడట్లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే పోలీసులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వసంత మృతి వెనకాల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్న కఠినమైన చర్యలకు ప్రభుత్వం, ఉన్నత అధికారుల, పోలీసులు తక్షణం పూనుకోవాలని లేకపోతే భవిష్యత్ ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డి ఎస్, రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి ఏఐఎఫ్ డిబ్ల్యు రాష్ట్ర కోశాధికారి తాండ్ర కళావతి మహిళా నాయకులు జయ లక్ష్మి, జి. శివాని, జి. లలిత, ఈశ్వరమ్మ, విమల, కళ్యాణిబాయి, వీరమని బాయి, కమలబాయి, శ్వేతబాయి, పార్టీ నాయకులు తుకారాం, నర్సింహా, రమేష్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.