చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని విశాఖ శ్రీ శారద పీఠపాలిత శ్రీ వెంకటేశ్వరాలయ సముదాయంలో మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిరియాల రాఘవరావు, డైరెక్టర్ మిరియాల ప్రీతమ్‌లను ఆలయ పాలకమండలి ఘనంగా సత్కరించింది. దేవాలయంలో కొనసాగుతన్న శ్రీవారి 25వ వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో విద్యుద్ధీపాలంకరణ సేవలో రూ.3లక్షలు వెచ్చించినందుకు గాను వారికి ఈ గౌరవం దక్కింది. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్‌రెడ్డి, ఆలయ పాలకమండి అధ్యక్షుడు కట్ల రఘుపతిరెడ్డి, సభ్యులు సుభాష్, ఆలయ ప్రధానార్చకులు శ్రీ సుదర్శనం సత్యసాయిలు రాఘవరావు కుటుంబసభ్యులకు శ్రీవారి విగ్రహంతో కూడిన జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా రాఘవరావు, ప్రీతమ్‌లు మాట్లాడుతూ ప్రతీ ఏడు బ్రహ్మోత్సవాల్లో తమకు ఇలా సేవ చేసుకునే భాగ్యం కల్పిస్తున్నందుకు ఆలయ పాలకమండలికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. స్వామి వారి కృప తో చందానగర్ డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.