- జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ని కలిసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ హమీద్ పటేల్
నమస్తే శేరిలింగంపల్లి : బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ సహబ్ సమీక్ష నిర్వహించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తుందని, నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమెకు తెలిపారు. అనంతరం మంజీర పైప్ లైన్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని వినతి పత్రం అందించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు.