బీసీ మహా ధర్నాను విజయవంతం చేద్దాం తరలిరండి

  • బీసీ జనసభ ఉద్యమకారుడు రాజారామ్ యాదవ్ ఆధ్వర్యంలో 15న ధర్నా
  • వాల్ పోస్టర్స్ ధర్నా కరపత్రాలు ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : బీసీ జనసభ ఉద్యమకారుడు రాజారామ్ యాదవ్ ఆధ్వర్యంలో 15న ఇందిరాపార్కు వద్ద బీసీ మహా ధర్నాకు హెచ్ యూ బీసీ స్టూడెంట్స్ యూనియన్ మద్దతు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బీసీ స్టూడెంట్స్ యూనియన్ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్స్ ధర్నా కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ బీసీ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాజారామ్ యాదవ్ ధర్నాకు పూర్తి మద్దతు తెలుపుతూ అదే రకంగా బీసీ కులగణన జరగాలని, లోకల్ బాడీస్ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. బీసీ ముఖ్య నాయకుడు ముదిరాజ్ మహాసభ స్టూడెంట్స్ అధ్యక్షుడు శివకుమార్ స్టూడెంట్స్ తోపాటు శేరిలింగంపల్లి ప్రాంతంలో నివసించే బీసీలందరూ పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. బీసీల రిజర్వేషన్ తో పాటు అధికారంలో మన భాగస్వామ్యం ఉండాలని జనగణన చేయాలని కోరారు. బీసీ ఐక్యవేదిక స్టూడెంట్స్ అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా కులగణన తోపాటు మేమెంతో మాకు అంత దామాషా పద్ధతిన రిజర్వేషన్స్ 42 శాతం కల్పించాలని, బీసీలందరూ విద్యార్థులు ఈ ప్రాంతీయ బీసీ నాయకులు, బీసీ ఉద్యోగులు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

వాల్ పోస్టర్స్, ధర్నా కరపత్రాలు ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్, ఆర్కే సాయన్న, తదితరులు

బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ ఉద్యమకారుడు కాంటెస్ట్ ఎమ్మెల్యే రాజారాం యాదవ్ ధర్నాకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ కాకుండా అన్ని యూనివర్సిటీల విద్యార్థులు ఉద్యోగులు, హైదరాబాద్ పట్టణం నుండి ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శి రవి మాట్లాడుతూ హెచ్ సి యు నుండి మేము అందరు పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు, ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ రాజారామ్ యాదవ్ చేపట్టిన ధర్నాకు తెలంగాణ రాష్ట్రం లోనీ అన్ని జిల్లాల నుంచి బీసీ నాయకులు తరలివచ్చి తమ పూర్తి మద్దతు తెలుపుతూ మహాధర్నాని విజయవంతం చేయాలని, స్టూడెంట్స్ అందరూ పాల్గొనాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి స్టూడెంట్స్, బీసీ సంఘం, బీసీ స్టూడెంట్స్, బిసి ఉద్యోగులు, బీసీ ఫ్యాకల్టీ మద్దతుదారులు అభిమానులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here