నమస్తే శేరిలింగంపల్లి : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, యువ నాయకులు ఆదిల్ పటేల్ లింగంపల్లి డోయేన్స్ టౌన్షిప్ లోని విద్యాంజలి హై స్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
ఈ సందర్బంగా ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని, ప్రజా సంక్షేమంలో, ప్రజా పరి రక్షణలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఓటు హక్కు అన్నిటికంటే బలమైనది అని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడ మీ మీ పోలింగ్ బూతులకు చేరుకోని, ఓటు వెయ్యాలని కోరారు.