
కొండాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): రంగన్న కుంట సుందరీకరణ పనులు చేపట్టిన జాగృతి కాలనీ అసోసియేషన్ సభ్యుల కృషి అభినందనీయమని ప్రభువా విప్ గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని జాగృతి కాలనీ లోగల రంగన్న కుంటను కాలనీ అసోసియేషన్ సభ్యులు, జీఈ ఇండియా, యూనైటడ్ వే అఫ్ హైదరాబ్ సంస్థల సంస్థల సహకారంతో సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ హాజరయ్యారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ చెరువు సుందరీకరణకు కాలనీవాసులు స్వచ్చందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు.

కాలనీ వాసులు, స్వచ్చంద సంస్థల కృషితో రంగన్న కుంటకు మహర్దశ కలిగిందన్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ,వాకింగ్ ట్రాక్ ,చిన్న పిల్లల ఆటస్థలం ఏర్పాటు చేసి అసోసియేషన్ సభ్యులు అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. చెరువులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెరువులను కబ్జాలకు గురికాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు శేరిలింగంపల్లి బయో డైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ నీరజ గాంధీ ,ఇరిగేషన్ ఈ ఈ రేణుక, జీఈ ఇండియా సంస్థ ప్రతినిధులు పరాగ్ ,మురళి మరియు యునైటెడ్ వే అఫ్ హైదరాబాద్ ప్రతినిధులు కిరణ్మయి, రేఖ, భూషణ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజు ,తెరాస సీనియర్ నాయకులు ఉట్ల కృష్ణ, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు లక్ష్మా రెడ్డి, ప్రసాద్ ,బిఎస్ ఎన్ కిరణ్ యాదవ్, బాల కృష్ణ యాదవ్, రాజేష్ యాదవ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు జ్ఞాన్ తేజ, రామకృష్ణ, పవన్, చంద్రశేఖర్, రాణి తదితరులు పాల్గొన్నారు.





