హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ కొండా విజయ్ కుమార్ తదితరులు

మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): పేద మహిళలకు చేయూత నివ్వాలనే ఉద్దేశ్యంతో హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శనివారం మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన మహిళలు లక్ష్మీ ,అనురాధ , యాదమ్మ , శ్రీదేవి లకు హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ లను గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కొండా విజయ్ పేద ప్రజలకు నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరు సమాజంలో పేదలకు చేయూతనందించాలని కోరారు. కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్, మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, తెరాస నాయకులు మిర్యాల రాఘవరావు, రామేశ్వరమ్మ , మిర్యాల ప్రీతం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here