కాసాని జ్ఞానేశ్వర్ కు భారీ మెజార్జీతో విజయం ఖాయం

  • కాసాని జ్ఞానేశ్వర్ కు అయ్యప్ప సొసైటీ కాలనీ సభ్యుల మద్దతు
  • అయ్యప్ప సొసైటీ కాలనీ సభ్యుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధి అయ్యప్ప సొసైటీ కాలనీ వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని మద్దతు తెలిపినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇద్దామని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అయ్యప్ప సొసైటీ కాలనీ సభ్యుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here