- బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పిలుపు
- కనులవిందుగా యాదవ ఆత్మీయ సమ్మేళనం
నమస్తే శేరిలింగంపల్లి : హైదరాబాద్ తిలక్ నగర్ బతుకమ్మ కుంట రోడ్డు వద్ద యాదవ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో యాదవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ సంఘం గ్రేటర్ హైదరాబాద్ చిట్టబోయిన నందకిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ తో కలిసి బిజెపి రాజ్యసభ సభ్యులు బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎన్ . లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
యాదవుల పట్ల అంకితభావంతో పనిచేసే పార్టీ బిజెపి పార్టీ అని, అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీ బిజెపి పార్టీ అన్నారు. యాదవులంతా సంఘటితం కావాలని తమ ఓటు బ్యాంకుతో బిజెపిని గెలిపిస్తే.. యాదవుల రాజ్యాధికారానికి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎంపీ కిషన్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని, ఈ యాదవ సమ్మేళనంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యాలు పాలించిన వారు యాదవులన్నారు. యాదవ కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం చాలా సంతోషంగా ఉందన్నారు. యాదవ జాతి ఐక్యమత్యమే యాదవ రాజ్యాధికారం అని అన్నారు. దీనికై రాష్ట్రంలో ఉన్న యాదవులందరినీ ఐక్యం చేసి వారికి యాదవ రాజ్యాధికారం గురించి వివరించి వారిని మేలుకొలిపే బాధ్యత యాదవ నాయకులదేనన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, యాదవుల ఆత్మీయ సమ్మేళనం సభ అధ్యక్షులు చిట్టబోయిన నందకిషోర్ యాదవ్, గోల్కొండ జిల్లా అధ్యక్షులు పాండు యాదవ్, బేగంబజార్ కార్పోరేటర్ శంకర్ యాదవ్, కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ రమేష్ యాదవ్, సదన్ కా భాష లడ్డు యాదవ్, ఎర్రగుంట్ల ప్రభాకర్ యాదవ్, వక్తలు మల్లేష్ యాదవ్, జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాములు యాదవ్, జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వంశీ యాదవ్, సినీ ఆర్టిస్టు కరాటే కళ్యాణి యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న, శేరిలింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షులు అందేలా సత్యనారాయణ యాదవ్, గొర్రెల మేకముల పెట్టుకుంటారుల జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, విజయవాడ వాస్తవ్యులు ఆల బాలయ్య శ్రీకృష్ణదేవరాయల గ్రంథం ప్రచురకర్త, యాదవ బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు.