శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నిరయోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలు, బస్తీల్లో దాదాపు 6 కోట్ల రూపాయలతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ గాంధీ మాట్లాడుతూ అభివృద్ధి పనులు పూర్తయితే ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కాలనీ లో డ్రైనేజీ, మంచి నీటి పైప్ లైన్ మరియు రోడ్లు వంటి అన్ని రకాల మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కాంట్రాక్టర్లు పనులు త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని ,నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుడదని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు.
మియాపూర్ లో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ లో రూ.69 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేబట్టబోయే యూజీడీ పైప్ లైన్ మరియు మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు జలమండలి అధికారుల తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి డిజిఎం నాగ ప్రియా డివిజన్ టీఆరెస్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు, కిరణ్ యాదవ్, మోహన్ ముదిరాజ్, విద్య సాగర్ , బాబ్జి , శ్రీనివాస రావు , మహేందర్ ముదిరాజ్ , జహంగీర్, రాజు , మల్లేష్ , ప్రతాప్ రెడ్డి , కిషోర్,ప్రేమ్ కుమార్, , హనుమంత్ , రాజు వంశీ, ఖాజా, చంద్రిక ప్రసాద్ గౌడ్, రోజా,వరలక్ష్మి , సుప్రజ తదితరులు పాల్గొన్నారు
హఫీజ్ పేట్ డివిజన్ లో…
హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం గ్రామం, శాంతి నగర్, మదీనగూడా గ్రామం, యూత్ కాలనీ, హుడా కాలనీ, సాయి నగర్ బస్తీలో హెచెండబ్ల్యూఎస్ బోర్డు నిధులతో మంజూరైన రూ.1 కోటి 34 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేబట్టబోయే యూజీడీ పైప్ లైన్ మరియు మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత గౌడ్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి డిజిఎం నాగ ప్రియా మరియు డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ తెరాస నాయకులు వాలా హరీష్ , లక్ష్మా రెడ్డి , దొంతి శేఖర్ , కంది జ్ఞానేశ్వర్ ,తదితరులు పాల్గొన్నారు.
చందానగర్ డివిజన్లో…
చందా నగర్ డివిజన్ పరిధిలోని జవహర్ కాలనీ లో హెచెండబ్ల్యూఎస్ బోర్డు నిధులతో మంజూరైన రూ.78 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయంతో చేబట్టబోయే యూజీడీ పైప్ లైన్ మరియు మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ నవతా రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి డిజిఎం నాగ ప్రియా , మేనేజర్ సుబ్రహ్మణ్యం మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు ,సునీత రెడ్డి, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్ ,తెరాస నాయకులు మిర్యాల రాఘవరావు ,ఉరిటి వెంకట్రావ్,దాసరి గోపి కృష్ణ , జేరిపాటి రాజు, లక్ష్మా రెడ్డి , ప్రసాద్, అక్బర్ ఖాన్, గురుచరణ్ దూబే , గుడ్ల ధన లక్ష్మి స్థానికులు తదితరులు పాల్గొన్నారు .
మాదాపూర్ డివిజన్ లో…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో హెచెండబ్ల్యూఎస్ బోర్డు నిధులతో మంజూరైన రూ.2 కోట్ల 18 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే యూజీడీ పైప్ లైన్ మరియు మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి డిజిఎం నారాయణ, టీఆరెస్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , తెరాస నాయకులు సాంబశివరావు , గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్ రావు , బృంద రావు , బాబు మియా , మియన్ పటేల్, బాబు మియా, ఖాసీం,రహీమ్, మాణిక్యం, విల్సన్ , కాజా, సాజిద్ , ముక్తార్ , రామకృష్ణ , నర్సింహా , ఉమా ప్రభాకర్, రాణి తదితరులు పాల్గొన్నారు .
కొండాపూర్ డివిజన్ లో…
కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్ నగర్ లో హెచెండబ్ల్యూఎస్ బోర్డు నిధులతో మంజూరైన రూ.57 లక్షల 40 వేల అంచనా వ్యయంతో చేబట్టబోయే యూజీడీ పైప్ లైన్ మరియు మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ గాంధీ స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి డిజిఎం నారాయణ, మేనేజర్ నివర్తి, మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజు, డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్ , తెరాస నాయకులు చాంద్ పాషా, రమేష్ బలరాం యాదవ్, తిరుపతి రెడ్డి, భాస్కర్ రెడ్డి, తిరుపతి యాదవ్, నరేష్, నందు, గణపతి, పద్మ శ్రీ స్థానికులు తదితరులు పాల్గొన్నారు .
గచ్చిబౌలి డివిజన్ లో..
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి ఐశ్వర్య కాలనీ లో హెచెండబ్ల్యూఎస్ బోర్డు నిధులతో మంజూరైన రూ..46 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయంతో చేబట్టబోయే యూజీడీ పైప్ లైన్ మరియు మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ ప్రభుత్వ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం రాజశేఖర్ , డిజిఎం నారాయణ ,మేనేజర్ వెంకటేశ్వర్లు మరియు గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు తెరాస నాయకులు చెన్నం రాజు ,నరేష్ ,వినోద్ , యాదగిరి ,జగదీష్ ,మల్లేష్ ,కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు .





