ఎస్ఐ అబ్బాస్ అలీ కుటుంబానికి అండ‌గా నిలిచిన మాదాపూర్ పీఎస్‌ సిబ్బంది

  • సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ చేతుల మీదుగా రూ.3 ల‌క్ష‌ల ఆర్ధిక స‌హాయం అంద‌జేత‌

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ పోలీస్‌స్టేష‌న్‌లో స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్న అబ్బాస్ అలీ ఇటీవ‌ల క‌రోనా వ్యాది బారిన ప‌డి మృతి చెందారు. కాగా మాదాపూర్ పోలీస్‌స్టేష‌న్ సిబ్బంది అంద‌రు క‌లిసి రూ. 3 ల‌క్ష‌ల స‌హాయ నిధిని పోగేశారు. ఆ మొత్తాన్ని శ‌నివారం సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ వీసి స‌జ్జ‌నార్ చేతుల మీదుగా అబ్బాస్ అలీ కుటుంబానికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ తోటి పోలీసు అధికారి కుటుంబానికి అండ‌గా నిలిచిన మాదాపూర్ పోలీసు సిబ్బందిని ఆయ‌న అభినందించారు. పెద్ద దిక్కును కోల్పోయిన పోలిసు కుటుంబాల‌కు తోటి సిబ్బంది స‌హ‌కారం అందించుకోవ‌డం ఆద‌ర్శ‌నీయ‌మ‌న్నారు. మిగిలిన పోలీసులు వారిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సైబరాబాద్ మాదాపూర్ ఏసీపీ రఘునందనరావు, ఇన్‌స్పెక్ట‌ర్‌ రవీంద్ర ప్రసాద్, డీఐ నవీన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఎస్ఐ అబ్బాస్ అలీ కుటుంబ స‌భ్యుల‌కు రూ. 3 ల‌క్ష‌ల ఆర్ధిక స‌హాయాన్ని అందిస్తున్న సీపీ స‌జ్జ‌నార్‌, మాదాపూర్ ఏసీపీ ర‌ఘునంద‌న్‌రావు, ఇన్‌స్పెక్ట‌ర్ ర‌వీంద్ర‌ప్ర‌సాద్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here