- విద్యార్థులను, అధ్యాపకులను అభినందించి సత్కరించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్, హఫీజ్పేట్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : పది తరగతి పరీక్షా ఫలితాల్లో మైత్రినగర్ లోని త్రివేణి స్కూల్ బ్రాంచ్ విద్యార్థులు సత్తాచాటిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 10/10 సాధించిన త్రివేణి స్కూల్ విద్యార్థులను శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్, హఫీజ్పేట్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ ఘనంగా సత్కరించారు.
అనంతరం మాట్లాడుతూ .. ఉన్నత శ్రేణి విద్యా ప్రమాణాలతో, క్రమశిక్షణ కలిగిన విద్యాభోదనతో త్రివేణి ట్యాలెంట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. పది ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కే. లీలా సాయి చరణ్, కే. ప్రణవి, గల్ల పూజ్య, బసవరాజు శ్రీహిత, కడలి అర్జున దేవి, రూపాని దీక్షిత, కృతిక శ్రీ మహా, కే. హిమేంద్ర సాయి, కే. శ్రీ హర్షిత, ఎస్. వెంకట సాయి తన్మయి, కౌండిన్య, టి.కీర్తి సాయి తేజస్విలను, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సెంటర్ హెడ్ సాయి నర్సింహా రావు, ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసన్న, హాస్టల్ ప్రిన్సిపాల్ జగదీశ్వర్ రావు, లింగంపల్లి బ్రాంచ్ ప్రిన్సిపల్ అనితారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు