శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర బీజేపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించి తీవ్ర గాయాలకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆ పార్టీ కార్యకర్త గంగల శ్రీనివాస్ కు శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు శుక్రవారం నివాళులు అర్పించారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చౌరస్తా (లింగంపల్లి రైల్వే బ్రిడ్జి) వద్ద శ్రీనివాస్ చిత్రపటానికి బీజేపీ నాయకలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నిరంకుశ, నియంతృత్వ పాలనకు మనస్తాపం చెందే శ్రీనివాస్ మృతి చెందాడని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శులు ప్రశాంత్ చారి, చిట్టారెడ్డి ప్రసాద్, సీనియర్ నాయకులు మారం వెంకట్, శాంతి బూషన్ రెడ్డి, శివకుమార్, ఉపాధ్యక్షులు బాలరాజు, కుమార్ యాదవ్, అశోక్ నాయక్, బాస్యా నాయక్, కిషోర్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.






