నమస్తే శేరిలింగంపల్లి : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అవనీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ నిరుపేద కుటుంబానికి నగదు సాయం చేశారు.
నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ అమిర్ అలీ దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న శీరిష సత్తూర్ వారి మందులకు గాను రూ. 5 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెహమాన్ , శివ పాల్గొన్నారు.