నమస్తే శేరిలింగంపల్లి : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో న్యూ హఫీజ్‌పేటలో మియాపూర్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ , మియాపూర్ ఏసీపీ మియాపూర్, చందా నగర్, ఆర్సి పురం, కొల్లూరు ఎస్హెచ్ఓలు, మియాపూర్ డివిజన్ ఎస్ఐలు, సిఐఎస్‌ఎఫ్‌తో పాటు మియాపూర్ పీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలకు కల్పించే రక్షణపై భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని మాదాపూర్ అడిషనల్ డీసీపీ, మియాపూర్ ఏసీపీ అన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పూర్తి రక్షణ కల్పిస్తామని తెలిపారు.