నీటిని వృథా చేయొద్దు…కలుషీతం కానీయద్దు

  • ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జలదినోత్సవం సందర్భంగా అవగాహన
  • గోడపత్రికను ఆవిష్కరించిన అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి

నమస్తే శేరిలింగంపల్లి : ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నీటి ప్రాముఖ్యత, నీరు వృథా కాకుండా కలుషితం కాకుండా చూడటంపై అవగాహన పెంపొందించే విషయాలను వివరించే గోడ పత్రికను హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ 15వ డివిజన్ జనరల్ మేనేజర్ రాజశేఖర్ వారి కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు.

” ప్రపంచ వ్యాప్తంగా మార్చి 22న ఐక్యరాజ్యసమితి సూచనల మేరకు ‘ప్రపంచ నీటి దినోత్సవాన్ని “ప్రకృతి ప్రసాదించిన వనరులను భవిష్యత్తు తరాలకు అందించడానికి పొదుపుగా వాడుకోవలసిన సామాజిక బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అందరిచేత ‘ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటాం. నీటిని వృథా చేయం. నీటి వనరులను కలుషితం కానీయం’ అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ మారబోయిన సదానంద్ యాదవ్, సభ్యులు పాలం శ్రీను, వెంకటేశ్వర్లు, రఘునాథరావు, జి.వి.రావు, జిల్ మల్లేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here