- ఎల్లమ్మ చెరువులో మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ నిర్మాణం పనుల పరిశీలన
- అధికారులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆదేశం
నమస్తే శేరిలింగంపల్లి : ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఆరెకపూడి గాందీ తెలిపారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులలో భాగంగా రూ. 2 కోట్ల 74 లక్షల అంచనావ్యయంతో చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ నిర్మాణం పనులను పరిశీలించి మాట్లాడారు.
చెరువులో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పైప్లైన్ నిర్మాణం పనులకు వేగం పెంచాలని, పనులు నాణ్యత ప్రమాణాలతో చేపెట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు ఆదేశించారు.
చెరువులను సంరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ఎల్లమ్మ చెరువును సుందరవనంగా, శోభితవర్ణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.