- విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే గాంధీ
నమస్తే శేరిలింగపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ మున్సిపల్ కల్యాణ మండపంలో పదవ తెలంగాణ రాష్ట్ర క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2024 వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఆ ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసి వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహమ్మద్ బేగ్, అక్బర్ ఖాన్, ప్రవీణ్ రెడ్డి, యూసఫ్, నరేందర్ బల్లా, అంజద్ పాషా, భాస్కర్ పాల్గొన్నారు.