శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకి తెరాస నాయకుడు గుర్ల తిరుమలేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కవితను బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో కలిసిన తిరుమలేష్ ఆమెకు మొక్కను బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.






