నమస్తే శేరిలింగంపల్లి : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి నగరేశ్వర దేవాలయం హుడా కాలనీ చందా నగర్, హాఫిజ్ పెట్ డివిజన్ కార్య వర్గం ఏర్పాటైంది. లింగంపల్లి లోని హుడా ట్రేడ్ సెంటర్ భవనం లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. టెంపుల్ ఫౌండర్ మెంబెర్స్ మెజారిటీ సభ్యులు కలిసి ఏకగ్రీవంగా ఆలయ కమిటీని ఎన్నుకున్నారు.
ఫౌండర్ చైర్మన్ గా పోల కోటేశ్వర రావు, ప్రెసిడెంట్ గా వీరబొమ్మ శ్రీనివాస్, సెక్రెటరీగా మారం వెంకట్, ట్రెజరీ గా వీరబోమ్మ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ లుగా బాధం సాయిబాబా, మాషెట్టి ప్రభాకర్, నాగ ప్రసాద్, జాయింట్ సెక్రటరీలుగా, కృష్ణ రాచురి, వినయ్ కుమార్, మహేష్ కోటగిరి, గుండా మధు, మంచాల ఫానిందర్, చీఫ్ అడ్వైసర్లుగా పబ్బతి వెంకట రవి, జగని శ్రీనివాస్, కట్ట రవి కుమార్, కొండా విజయ్ కుమార్, దొంతుల సుధాకర్, బొమ్మకంటి బాలయ్య, దారా కృష్ణ మూర్తి, తాడేపల్లి వెంకటేశం, పోతుగంటి చిన్న శివరామయ్య, ఈసీ మెంబర్లుగా, ఉషారాణి, పోల వాణి, మంచాల విజయ రావు, ఎంవీ సుబ్బారావులను ఎన్నుకున్నారు.
ఈ సమావేశం సందర్భంగా దేవాలయ లెక్కలను సభ్యులందరూ పరిశీలించారు.