ఇద్ద‌రు పిల్ల‌ల‌తో స‌హా మ‌హిళ అదృశ్యం

మియాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఓ మ‌హిళ త‌న ఇద్ద‌రు పిల్ల‌లతో స‌హా ఇంట్లో చెప్ప‌కుండా బ‌య‌టికి వెళ్లి అదృశ్య‌మైంది. మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని హ‌ఫీజ్‌పేట ప్రేమ్ న‌గ‌ర్‌లో నివాసం ఉండే చామంతుల దీపిక (34) స్థానికంగా కూలి ప‌నులు చేస్తూ జీవ‌నం సాగిస్తోంది. కాగా అక్టోబర్ 31వ తేదీన దీపిక త‌న కుమార్తె సాయిలిపి (14), కుమారుడు చైత‌న్య (9)ల‌ను తీసుకుని ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా బ‌య‌ట‌కు వెళ్లింది. అనంత‌రం తిరిగి రాలేదు. ఈ క్ర‌మంలో వారి ఆచూకీ కోసం కుటుంబ స‌భ్యులు అన్ని చోట్లా గాలించారు. అయినా వారి జాడ తెలియ‌లేదు. దీంతో వారి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

దీపిక‌, సాయిలిపి, చైత‌న్య (ఫైల్‌)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here