దివ్యాంగుల సేవా సంఘానికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాం

  • ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించిన ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ కౌడే పోచయ్య, మాజీ కార్పొరేటర్ బోడ అనయ్ డిన్నా, భారత జాగృతి అధ్యక్షులు బల్మూరి సుమన్ రావు, లండన్ ఎన్ఆర్ఐ యూకే

నమస్తే శేరిలింగంపల్లి : దివ్యాంగుల సేవా సంఘం, బల్మూరి సుమన్ రావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ముగింపు సంబురాలు, దివ్యాంగుల సేవా సంఘం 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ కౌడే పోచయ్య, మాజీ కార్పొరేటర్ బోడ అనయ్ డిన్నా, భారత జాగృతి అధ్యక్షులు బల్మూరి సుమన్ రావు, లండన్ ఎన్ఆర్ఐ యూకే పాల్గొని ప్రసంగించారు.

సాహిత్యం, నటన, విద్యా రంగంలో ప్రతిభ కనబరచిన వారికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్న దృశ్యం

దివ్యాంగుల సేవా సంఘం సంఘానికి భారత జాగృతి ఎన్ఆర్ఐ యూకే సహయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని బల్మూరి సుమన్ రావు తెలిపారు. ఇంత పెద్ద కార్యక్రమానికి పూర్తి నిర్వాహక బాధ్యతలు స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దివ్యాంగుల సేవా సంఘం కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు ప్రతిభ గలిగిన వారికి సాహిత్యం, నటన, విద్యా రంగంలో ప్రతిభ కనబరచిన వారికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

అనంతరం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ బోడ అనయ్ డిన్నా పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు. దివ్యాంగులు తన కుటుంబ సభ్యులని, దివ్యాంగుల సేవా సంఘం రాష్ట్ర నాయకులు గతంలో ఐదారు సంవత్సరాలు తనతో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సేవా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గౌని యాదగిరి మాట్లాడుతూ.. దివ్యాంగులు సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ముగింపు వారోత్సవాలు, దివ్యాంగుల సేవా సంఘం 3 వ వార్షికోత్సవాలు ఇంత చక్కగా నిర్వహించేలా దివ్యాంగుల సేవా సంఘానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన బల్మూరి సుమన్ రావుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వికలాంగులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వికలాంగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వికలాంగులకు భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సేవా సంఘం రాష్ట్ర నాయకులు ఎండి.మహబూబ్ అలీ అధ్యక్షులు, అన్న మహేష్ ప్రదాన కార్యదర్శి, సయ్యద్ మదార్ పాషా ఉపాధ్యక్షులు , సహాయ కార్యదర్శి సమ్మెట వేణు, కన్వీనర్ రావుల వెంకట్ రెడ్డి , ఉమ్మడి వరంగల్ జిల్లా దివ్యాంగుల సేవా సంఘం ఉమ్మడి జిల్లాల నాయకులు, తెలంగాణ రాష్ట్ర పలు దివ్యాంగుల సంఘాల నాయకులు జగన్, గుత్తి కొండ కిరణ్, మెరుగు శివ కృష్ణ, మున్నా, తుడం రాజేందర్, గజ్జి పైడి‌ ,మున్నా, కనకబోయిన నాగరాజు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here