- వేడుకగా ఆత్మీయ సమ్మేళనం
నమస్తే శేరిలింగంపల్లి : ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానని, ప్రజలకు అండదండగా ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నివాసంలో నియోజకవర్గంలోని డివిజన్ల పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సమ్మేళనంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబాలతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రసంగించారు.
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్ష అని, ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎపుడూ తెలంగాణ ప్రజల పక్షమేనని, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ ..గెలిచినప్పుడు పొంగి పోలేదు ..ఓటమితో కుంగి పోలేదని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దామని, వాళ్ళిచ్చిన హామీల అమలులో విఫలం అయితే ప్రజా గొంతుక అవుదామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీ ఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు.