- ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను పరిశీలించిన జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలాగా పని చేయాలని, ప్రతి కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్త పర్యవేక్షించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అనేక చోట్లా ఏరాటు చేసిన కేంద్రంలోని ఏర్పాట్లను జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడారు.
ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందించే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.