
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ రెండు నిరుపేద కుటుంబాలకు చేయూతను అందించాడు. గచ్చిబౌలి డివిజన్ కు చెందిన కవిత అనే యువతికి కుట్టు మిషన్ ను, గచ్చిబౌలి డివిజన్ తోఫా కాలనీ కి చెందిన గిరి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కొండా విజయ్ కుమార్ సామజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు. ఆపదలో ఉన్న వారికి సహకారం అందించడం దైవకార్యంలో సమానమని గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






