నమస్తే శేరిలింగంపల్లి : సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
న్యూ కాలనీలో సాంబశివరావు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ, కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జేరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద.. యూత్ కాంగ్రెస్ నాయకులు రాజన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద.. వివేకానంద నగర్ డివిజన్ రిక్షా పుల్లర్స్ కాలనీ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ, కూకట్పల్లి డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్, పాపి రెడ్డి కాలనీ, ఆస్బెస్టాస్ కాలనీ, అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగరలో కేక్ కట్ కటింగ్., కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ దవాఖానలో పండ్ల పంపిణీ,
మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామేట్, హైటెక్ సిటీ వద్ద కాంగ్రెస్ నాయకులు గంజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో డివిజన్ నాయకులు, కార్యకర్తలతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ఆ కార్యక్రమాలను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్ల ఆకాంక్ష ఫలించిన దివ్య దినం, రాష్ట్రమిచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీకి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.