గ‌ఫూర్‌న‌గ‌ర్‌లో డ్రైనేజీ స‌మ‌స్య‌ను పరిష్క‌రించిన కార్పొరేట‌ర్ హ‌మీద్‌ప‌టేల్‌

గ‌ఫూర్‌న‌గ‌ర్‌లో డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్‌

కొండాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని గ‌ఫుర్‌న‌గ‌ర్‌లో ఆదివారం స్థానిక కార్పొరేట‌ర్ హ‌మీద్‌ప‌టేల్ ప‌ర్య‌టించారు. గత కొన్ని రోజులుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగి మురుగునీరు రోడ్లలపైకి వ‌చ్చి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కార్పొరేటర్ హమీద్ పటేల్ దృష్టికి తీసుకువ‌చ్చారు. గఫుర్ నగర్ లోని శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ నుండి ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్ మీదుగా వెళ్ళు దారిలో మురుగు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయ‌న గుర్తించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడే ఉండి సమస్యను పరిష్కరించారు. ఎన్నో రోజులు నుండి ఈ సమస్య ఉందని, కార్పొరేటర్ హమీద్ పటేల్ దగ్గర ఉండి సమస్య పరిష్కరించటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని కార్పొరేట‌ర్ స్థానికులకు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏఈ శ్రీనివాస్, ఎస్ఆర్‌పీ కిరణ్, వార్డు మెంబర్ రాజు యాదవ్, ఏరియా కమిటీ మెంబర్ కుమ్మరి శ్రీనివాస్, యూత్ నాయకులు దీపక్, జగన్ రెడ్డి, సత్యనారాయణ దొర, డా మురళి, ఎల్లయ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ యంత్రంచే మురుగును శుభ్రం చేయిస్తున్న కార్పొరేట‌ర్ హ‌మీద్‌ప‌టేల్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here