శానిటేష‌న్ డ్రైవ్‌ల‌తో నాలాల శుభ్ర‌త

  • కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాలాల్లోకి కొట్టుకువచ్చిన చెత్తాచెదారం, బురద మట్టిని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా జేసీబీలతో తొలగించడం జరుగుతుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద, జడ్పీహెచ్ఎస్ పక్కన ఉన్న‌ నాలాలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, మట్టిని‌ జీహెచ్ఎంసీ చేపట్టిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దగ్గరుండి తొలగింపజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఏఎంహెచ్ఓ డాక్టర్ రంజిత్, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.

నాలాను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
జేసీబీతో నాలాలోని చెత్త‌ను తొల‌గింప‌జేయిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here