నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వపథకాలు అందేలా చూస్తామని, గత ప్రభుత్వంలో అవినీతికి, ప్రభుత్వ భూముల, చెరువుల ఆక్రమణలకు పాల్పడిన వారిని, వారికి సహకరించిన అధికారుల పై చట్టపరమైన చైర్యలు తీసుకొనే విదంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ప్రజలకు ఏ కష్టమొచ్చనా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.