నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ కి సంపూర్ణ మద్దతుగా నిలుస్తూ.. ఓటు వేసి గెలిపిస్తామని స్పష్టం చేస్తున్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్, సాయినగర్ తండాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయనకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.