శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న శేరిలింగంపల్లిలోని సురభి కళాకారులకు జనసేన పార్టీ అండగా నిలిచింది. సురభి కాలనీలో నివసించే సురభి కళాకారులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపుమేరకు ఆ పార్టీ నాయకుడు రవితేజ సహాయంతో 100మంది కళాకారుల కుటుంబాలకు ఒక వారానికి సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ కమిటీ సభ్యుడు యడమ రాజేష్, సుజాత, వెంకట్ లక్ష్మి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు బి అరుణ్ కుమార్, నిరంజన్, వెంకట్, ఆర్.జయనాథ్, రాజ్ గోపాల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రేటర్ కమిటీ సభ్యుడు యడమ రాజేష్ మాట్లాడుతూ సురభి కళాకారులకు సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో కరోనా కష్ట కాలంలో చాలా మందికి సహాయం చేశాం అని అన్నారు. ఇప్పుడు వీరికి సహాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు.






