నమస్తే శేరిలింగంపల్లి: సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం ఎం ఏ నగర్, స్టాలిన్ నగర్ కాలనీలలో చేపట్టారు. ఈ శిబిరంలో 600 మందికి కంటి అద్దాలను ట్రస్ట్ సెక్రటరీ రవికుమార్ యాదవ్ పంపిణీ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నివసిస్తున్న బస్తీ వాసుల ఆరోగ్యం, అభివృద్ధి, ఉద్యోగ, మౌలిక సదుపాయాల కోసం నిరంతరం కృషి చేస్తూ సుదీర్ఘంగా సేవలందిస్తూ, లాభా పేక్ష లేకుండా నిస్వార్థంతో ప్రజాసేవ చేస్తున్నామని తెలిపారు.
నేటి రాజకీయ నాయకులు కుటిల రాజకీయాలు చేస్తూ, ఇచ్చిన హామీలను మరిచి ఓటర్లను మభ్యపెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్న నాయకుల భరతం పడతామని, రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలని రవి కుమార్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, మాణిక్ రావు, మన్యం, గౌతమ్, రవికాంత్, గణేష్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్ ,వినోద్, ముఖేష్ గౌడ్, యాదగిరి, చరణ్, విజయేందర్, కృష్ణారెడ్డి, పాల్గొన్నారు.