- రూ. 1లక్ష 2వేల 500లకు కైవసం చేసుకున్న యెల్లంకి శ్రీనివాస్ గౌడ్
శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ని డివిజన్లలో వినాయక చవితి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. పార్టీలకతీతంగా ఆయా పార్టీల నేతలు మండపాలలో కొలువుదీరిన గణనాథులకు విశేష పూజలు చేపడుతూ వస్తున్నారు. వినాయక నిమజ్జనాలకు తరలుతున్న గణనాథులకు స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తూ ఘన వీడ్కోలు పలుకుతున్నారు. నిమజ్జనోత్సవానికి ముందు నిర్వహిస్తున్న వేలం పాటల్లో గణపయ్య లడ్డూలను దక్కించుకుంటూ తమ భక్తిని చాటుకుంటున్నారు.
ఇందులో భాగంగా మియాపూర్ లోని ఆర్బీఆర్ టవర్స్ లో నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాట వేడుకగా జరిగింది. ఆ లడ్డూను రూ. 1లక్ష 2వేల 500లకు యెల్లంకి శ్రీనివాస్ గౌడ్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్బీఆర్ టవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచమళ్ల ఓంప్రకాష్ గౌడ్ లడ్డూను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో అసోసియేషన్ సభ్యులు సురేష్ కుమార్, గోవింద్ నాయక్, జేవీ రమణ, లక్ష్మణ్, ప్రతాప్ రెడ్డి, కృష్ణ మోహన్, అంజి రెడ్డి, మురళీ కృష్ణ, నవత, ఆర్కే రెడ్డి, మన్మధరావు, బాలరాజు, భార్గవ పాల్గొన్నారు.