నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ, సుదర్శన్ నగర్, లక్సర్ అపార్ట్ మెంట్స్, ఆర్ వీ పాంచజన్య అపార్ట్ మెంట్స్ లలో వినాయక చవితి పర్వదినంను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వినాయక మండపాలను ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ సందర్శించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ , మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారబోయిన రవీందర్ యాదవ్, ప్రవీణ్, పద్మారావు, కృష్ణ యాదవ్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, నటరాజు, పవన్, మహేష్, రాజు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.