– రూ.51 వేలకు హుండీని దక్కించుకున్న రెడ్డి ప్రవీణ్ రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ లో శ్రీ దుర్గ భవాని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. సోమవారం అమ్మవారి నిమజ్జన ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో స్థానిక వ్యాపారి రెడ్డి ప్రవీణ్ రెడ్డి రూ.51 వేలకు అమ్మవారి హుండీని దక్కించుకున్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయకుమార్ ను నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దుర్గాభవాని ఉత్సవ సమితి ప్రతినిధులు భీమని శ్రీనివాస్, మహేష్ తివారి, రవిచందర్ గుప్త, బాలకృష్ణ, మనీష్, కిరణ్, విజయ్, అజయ్, పాండు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.







