నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ ఎస్ హఫీజ్‌పేట డివిజన్ యువజన అధ్యక్షుడి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే గాంధీ, హఫీజ్‌పేట డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ రఘునాథ్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
ఎస్సి సెల్ ప్రెసిడెంట్ కంది జ్ఞానేశ్వర్, బిఆర్ ఎస్ వార్డు కమిటీ మెంబర్ రవి కుమార్, వీరేందర్ పాల్గొన్నారు.
హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం శేష వస్త్రం బహుకరించారు.