- 4వ రోజు కొనసాగిన ఎంఎస్ ఎం ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరం
- దాదాపు 500 మందికి కంటి అద్దాలను పంపిణీ చేసిన ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: పాపరెడ్డి కాలనీలో హనుమాన్ టెంపుల్ వద్ద సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ శిబిరంలో దాదాపు 500 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి సమస్యలు ఉండి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం తమ ట్రస్టు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఆదుకుంటుందని తెలిపారు.
ఉచిత కంటి పరీక్షలు, , అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ, వేసవికాలంలో చలివేంద్రాల ఏర్పాటు, పదవ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణి, పేద విద్యార్థిని, విద్యార్థుల పై చదువుల కోసం చేయూత, అనుకోని విపత్తుల సంభవించినప్పుడు బాధితులకు ఆర్థిక, మౌలిక వసతుల అవసరాలను తమ సంస్థ తీర్చుతుందని తెలిపారు. కార్యక్రమంలో ముత్యాల రమేష్, నరసింహ, సంజీవరెడ్డి, బీరప్ప కురుమ, విజయ్ కుమార్ యాదవ్, రాజేష్, రాజు యాదవ్, నందగోపాల్ బాలరాజు, హరీష్, శ్రీకాంత్, ఇమ్రాన్ పాల్గొన్నారు.