- గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్రలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్రలో భాగంగా హాఫిజ్ పేట్ డివిజన్ హుడా కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు గాలికి వదిలేసి స్థానిక ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్, కబ్జాలపై దృష్టి పెడుతున్నారని తెలిపారు.
అమలు కాని హామీలిచ్చి అభివృద్ధిని మరిచి మాయమాటలతో పరిపాల కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదని తెలుపుతూ రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనంతరెడ్డి, రమణయ్య, శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్, మహేష్ యాదవ్, రమేష్, విజయ్, రాజు, అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.